: సెబీ నూతన చైర్మన్ గా అజయ్ త్యాగి నియామకం
మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ)సెబీ నూతన చైర్మన్ గా అజయ్ త్యాగి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల శాఖ అడిషినల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన హిమాచల్ ప్రదేశ్ చెందిన ఐఏఎస్ అధికారి. ఆర్బీఐ బోర్డులోనూ త్యాగి కొన్నిరోజుల పాటు పని చేశారు. కాగా, సెబీ చైర్మన్ గా ప్రస్తుతం యూకె సిన్హా ఉన్నారు. 2011 ఫిబ్రవరి 18న సెబీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. అయితే, ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. పొడిగించిన పదవీ కాలం కూడా గత ఏడాది ఫిబ్రవరితో ముగియడం, మరోమారు పొడిగించడం జరిగింది.