: శశికళ క్యాంపు నుంచి తప్పించుకొని... పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ శశికళకు షాక్‌లపై షాక్‌లు తగులుతున్నాయి. ఈ రోజు శశికళ భూములు లాక్కున్నారని అరప్పోర్ ఇయక్కమ్ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించారని పన్నీర్ సెల్వం వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారందరినీ రిసార్ట్ లో బంధించారని, వారిని బయటకు రప్పించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే షణ్ముగనాథన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. షణ్ముగనాథన్.. శశికళ క్యాంపు నుంచి తప్పించుకుని పన్నీర్ సెల్వం వద్దకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ ఎమ్మెల్యేలను విడిపించాలని మద్రాస్ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.