: చెన్నై పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న రాహుల్ గాంధీ
తమిళనాడులో క్షణక్షణానికి మారుతున్న రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిశితంగా పరిశీలిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరును రాహుల్ గమనిస్తున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు, ఈ అంశంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. తమ మిత్రపక్షమైన డీఎంకేకే తమ మద్దతు ఉంటుందని తెలిపింది.