: బెజవాడ దుర్గమ్మను దర్శించుకుని, సారె సమర్పించిన టీఆర్ఎస్ ఎంపీ కవిత
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనడానికి విజయవాడకు వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ కవిత ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సూర్యకుమారి ఆమెకు స్వాగతం పలికారు. ఆమె స్వయంగా కవితకు దర్శన ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కవిత.. సారె సమర్పించుకున్నారు.
మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పలువురు మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్త్రీ శక్తిని చాటి చెప్పే ఉపాన్యాసాలు ఇస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా నేటి నుంచి మూడు రోజులపాటు మహిళా పార్లమెంటు సదస్సు జరగనుంది.