: అతనితో కాటేజ్ షేర్ చేసుకోవడం ఓ పీడకల: కంగనా రనౌత్
విశాల్ భరద్వాజ్ సినిమా 'రంగూన్' షూటింగ్ సందర్భంగా హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ కంగనా రనౌత్ ల మధ్య కోల్డ్ వార్ జరిగిందని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అయితే, అంతా బాగానే ఉంది... ఎలాంటి సమస్య లేదని షాహిద్ కపూర్ చెబుతున్నా... కంగనా మాత్రం షాహిద్ పై నిప్పులు చెరుగుతోంది. అతనితో కలసి కాటేజీని పంచుకోవడమే తాను ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య అని ఆమె తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ సందర్భంగా షూటింగ్ కోసం మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని... అక్కడ కాటేజ్ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో, కాటేజ్ లు పంచుకోవాల్సి వచ్చిందని కంగనా తెలిపింది. షాహిద్ కు చెవులు దద్దిరిల్లేలా పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకుని విచిత్రమైన పాటలు వినడం అలవాటని... ఆ హిప్ హాప్ మ్యూజిక్ కు అదిరిపోతూ పొద్దున నిద్ర లేవాల్సి వచ్చేదని... వెంటనే రెడీ అయి, ఏదో ఒకటి తిని కాటేజ్ నుంచి బయటపడేదాన్నని కంగనా చెప్పింది. షాహిద్ తో కాటేజీని షేర్ చేసుకోవడం ఓ పీడకల అని తెలిపింది.