: ‘ఓల్డెస్ట్ పర్సన్ ఆఫ్ లివింగ్’ గా హైదరాబాద్ బామ్మ రికార్డు!
హైదరాబాద్ కు చెందిన శతాధిక వృద్ధురాలు అయిన నర్సమ్మ అరుదైన రికార్డు సృష్టించింది.1898లో నర్సమ్మ జన్మించింది. ప్రస్తుతం వనస్థలిపురంలో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆమె వయసు 119 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధులు ఆమెను ఓల్డెస్ట్ పర్సన్ ఆఫ్ లివింగ్ (ఫీమేల్) గా గుర్తించారు. సంస్థ ప్రతినిధులు ఈరోజు ఆమెను సన్మానించి, అవార్డును అందజేశారు.