: మధుసూదనన్ స్థానంలో సెంగొట్టయ్యన్ ను నియమించిన శశికళ
అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ గా మధుసూదనన్ స్థానంలో సెంగొట్టయ్యన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా ఆయనను తొలగించారు. శశికళ వర్గం నుంచి బయటకు వచ్చిన మధుసూదనన్ నిన్ననే పన్నీర్ సెల్వం శిబిరంలో చేరారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ శశికళపై నిప్పులు చెరిగారు. శశికళకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని మండిపడ్డారు. ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించే సమయంలో మధుసూదనన్ కీలకపాత్ర పోషించారు. అనంతరం జయలలితకు కూడా నమ్మకస్తుడిగా ఉన్నారు.