: ఎమ్మెల్యేల వద్దకు బయల్దేరిన పోలీసులు... ఎమ్మెల్యేలను అక్కడ నుంచి తరలించే పనిలో శశికళ వర్గం


అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను శశికళ అనుచరులు దాచిపెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో తమిళనాడు డీజీపీ స్పందించారు. ఎమ్మెల్యేలు ఉన్నారని భావిస్తున్న రిసార్ట్స్  కు వెళ్లాలని కాంచీపురం ఎస్పీని ఆదేశించారు. కాంచీపురం జిల్లాలోని మహాబలిపురం సముద్రంలో ఉన్న ఓ దీవిలోని రిసార్ట్స్ లో వీరిని దాచిపెట్టారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడకు పోలీసులు బయలుదేరారు. కాసేపట్లో రిసార్ట్స్ వద్దకు వారు చేరుకోనున్నారు.

మరోవైపు తమ కోసం పోలీసులు బయలుదేరారన్న విషయం తెలుసుకున్న శశి అనుచరులు... ఎమ్మెల్యేలను అక్కడ నుంచి తరలిస్తున్నట్టు సమాచారం. ముందుగా పడవల్లో ఎమ్మెల్యేలను సముద్ర తీరానికి తీసుకొచ్చి, అక్కడ నుంచి వేర్వేరు బృందాలుగా విడగొట్టి, వేర్వేరు ప్రదేశాల్లో వారిని ఉంచాలని శశి వర్గీయులు భావిస్తున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News