: బిపాషా బసు అందానికి కారణం అదేనట!
బాలీవుడ్ అందాల భామ బిపాషా బసు హీరో, మోడల్ కరణ్ సింగ్ గ్రోవర్ ను ప్రేమించి ఇటీవలే పెళ్లాడిన సంగతి తెలిసిందే. నలభై ఏళ్లకు దగ్గర పడుతున్నా బిపాషా అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తన భర్తతో కలసి ఓ పార్టీకి హాజరైన ఆమెను ఇదే విషయం గురించి అడిగారు. దీనికి సమాధానంగా... తన జీవితంలో పుష్కలంగా లభించిన ప్రేమే తన అందానికి కారణమని బిప్స్ తెలిపింది. తన సౌందర్య రహస్యం ప్రేమే అని చెప్పింది.
తనను వెండి తెరపై చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారన్న సంగతి తనకు తెలుసని... ప్రస్తుతం వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని... త్వరలోనే తామిద్దరం సినిమాల్లో బిజీ అయిపోతామని చెప్పింది. తన తర్వాతి సినిమా కామెడీ సినిమా కావచ్చని బిపాషా తెలిపింది. కథ బాగుంటే తన భర్తతో కలసి మరోసారి నటించడానికి సిద్ధమని చెప్పింది.