: ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు?: తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ ను విమానంలోనే అడిగిన మీడియా


తమిళనాడులో వేగంగా మారుతోన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ముంబై నుంచి బ‌య‌లుదేరిన ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు కొద్ది సేపటి క్రితం చెన్నై చేరుకున్న విష‌యం తెలిసిందే. అక్క‌డి రాజ‌కీయాల‌పై ఆయ‌న ఎలా స్పందిస్తారోన‌న్న ఉత్కంఠ అందరిలోనూ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను మీడియా ప్ర‌తినిధులు విమానంలోనూ ప్ర‌శ్నించారు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు?  మీ స్పంద‌న ఏంటీ? త‌దుప‌రి ఎటువంటి ప‌రిణామాలు ఉంటాయి? అంటూ విమానంలోనే ఆయ‌నను మాట్లాడించాల‌ని చూశారు.  అయితే,  విద్యాసాగర్ రావు మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడ‌లేదు. నో కామెంట్ అన్న‌ట్లుగా అలాగే ఉండిపోయారు. చెన్నై విమానాశ్రయంలో దిగిన  తర్వాత కూడా ఆయ‌న మీడియాతో మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రాజ్ భవన్ లో ఉన్నారు. కాసేపట్లో పన్నీర్ సెల్వంతో మాట్లాడనున్నారు.


  • Loading...

More Telugu News