: పోయెస్ గార్డెన్ నివాసం జోలికి వస్తే ఊరుకోం.. పన్నీర్ హెచ్చరికకు శశికళ వర్గీయుల కౌంటర్
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను పోయెస్ గార్డెన్ లో ఉన్న జయ నివాసం వేద నిలయం నుంచి వెళ్లగొడతానని... ఆ భవనాన్ని జయ స్మారక చిహ్నంగా మార్చుతానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే, ఈ వ్యాఖ్యలపై శశికళ సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జయ ఉన్న వేద నిలయం ఆమె వదిన ఇళవరసి కుమారుడు వివేక్ పేరు మీద ఉందని వారు తెలిపారు. వేద నిలయం ప్రభుత్వ ఆస్తి కాదని, ప్రైవేట్ ఆస్తి అని చెప్పారు. ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే... చూస్తూ ఊరుకోబోమని, కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.