: 10 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ వద్దకు పన్నీర్ సెల్వం... సింగిల్ గానే శశికళ!


తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు గవర్నర్ అపాయింట్ మెంట్ లు ఖరారయ్యాయి. ప్రొటోకాల్ ప్రకారం తొలుత కలిసే అవకాశం పన్నీర్ కే కల్పించారు. సాయంత్రం 5 గంటలకు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావుతో పన్నీర్ భేటీ అవుతారు. అనంతరం 7.30 గంటలకు శశికళ సమావేశమవుతారు.

10 మంది ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ తో పన్నీర్ సెల్వం భేటీ అవుతున్నట్టు సమాచారం. అయితే, తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలతో కాకుండా ఒంటరిగానే వచ్చి కలవాలని శశికళకు రాజ్ భవన్ నుంచి సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News