: ఇప్పుడు పోరాడ‌క‌పోతే జ‌య‌ల‌లిత ఆత్మ నన్ను ఎన్న‌టికీ క్ష‌మించ‌దు: మరోసారి పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు


త‌మిళ‌నాడు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగర్ రావుకు స్వాగ‌తం ప‌ల‌క‌డానికి చెన్నై ఎయిర్‌పోర్టుకి బ‌య‌లుదేరిన విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడింగ్ చైర్మన్ మధుసూదన్‌తో భేటీ అయిన‌ పన్నీర్ సెల్వం ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన మధుసూద‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాను ఇప్పుడు పోరాడ‌క‌పోతే అమ్మ జ‌య‌ల‌లిత ఆత్మ త‌న‌ను ఎన్న‌టికీ క్ష‌మించ‌దని ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌ధుసూద‌న్‌ను కూడా శ‌శిక‌ళ బెదిరించిందని ఆయ‌న ఆరోపించారు. త‌మ‌ పార్టీని ర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త త‌న‌కు ఉంద‌ని చెప్పారు. మధుసూదన్ చేరికతో తన బలం మరింత పెరిగిందని చెప్పారు. 

  • Loading...

More Telugu News