: గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ ను తుడిచిపెట్టేస్తాం: కోదండరాం
తెలంగాణపై మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తామన్నారు. ఢిల్లీలో నేడు సంసద్ సత్యాగ్రహ దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఐక్యత ఇకముందూ కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ రెండూ తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూర్చలేకపోయాయని విమర్శించారు. ఇక, సత్యగ్రహ దీక్ష విజయవంతం అవడంతో, ఆ స్ఫూర్తిగా, త్వరలో 'చలో అసెంబ్లీ' కార్యక్రమం చేపడతామని కోదండరాం తెలిపారు.