: ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు ఆన్ లైన్లో... పన్నీర్ కు అనూహ్యంగా పెరుగుతున్న మద్దతు!


తమిళనాడు కేర్ టేకర్ సీఎం ఓపీఎస్ కు అనూహ్యంగా మద్దతు పెరిగింది. అన్నాడీఎంకే ఐటీ విభాగం ఆయనకు అండగా నిలిచింది. ఈ విభాగంలో కీలకమైన హరి ప్రభాకరన్, శ్రీరామ్ తదితరులు, ఎమ్మెల్యేలందరి ఫోన్ నంబర్ల జాబితాను ట్విట్టర్ ఖాతాలో పెట్టి, పన్నీర్ కు మద్దతు పలకాలని కోరే వారంతా, ఈ నంబర్లకు మెసేజ్ లు చేయాలని కోరగా, మెసేజ్ లు, ట్వీట్లు హోరెత్తుతున్నాయి. ఐటీ విభాగం షేర్ చేసిన ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లను వేలాది మంది రీట్వీట్ చేసుకున్నారు.

నిన్న శశికళ సమావేశానికి వెళ్లి, ఆపై మాయమైన 26 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ కు మద్దతుగా ఉన్నారని ఈ ట్వీట్లలో కనిపిస్తోంది. మిగిలిన వాళ్లు పన్నీర్ కు మద్దతుగా ఉంటేనే ప్రజామోదం లభిస్తుందని, లేకుంటే పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నారు కూడా. ఈ పరిణామాలతో కంగుతిన్న శశికళ వర్గం, ఐటీ విభాగం సిబ్బందిని మార్చినా అప్పటికే పరిస్థితి చెయ్యి దాటి పోయి, ట్వీట్లను, ఫోన్ నంబర్లనూ తొలగించడం అసాధ్యమన్నంత స్థాయిలో షేర్ అయిపోయాయి. ఇది ప్రజలకు, శశికళకు మధ్య జరుగుతున్న యుద్ధమని, పన్నీర్ కు మద్దతివ్వాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై శాంతియుత ఒత్తిడి తేవాలని తన ట్వీట్ లో కోరిన శ్రీరామ్, ట్విట్టర్ లో ఉంచిన ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లివి.


  • Loading...

More Telugu News