: బిన్ లాడెన్ అనుచరుడిని ఖతం చేసిన అమెరికా దళాలు


సిరియాలోని ఇడ్లిబ్ లో అమెరికా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో ఆల్ ఖైదా నేత అబు హని అల్ మస్రీ మృతి చెందినట్టు పెంటగాన్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఇడ్లిబ్ పై అమెరికా వైమానిక దళాలు రెండుసార్లు దాడి చేశాయి. ఈ దాడుల్లో 11 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు మృతి చెందారు. ఇందులో మస్రీ కూడా ఉన్నాడు. గతంలో ఒసామా బిన్ లాడెన్ తో కలిసి మస్రీ పని చేశాడు. 1980, 1990 దశకాల్లో ఆఫ్ఘనిస్థాన్ లో ఆల్ ఖైదా గ్రూపును మస్రీ నడిపించాడు. బిన్ లాడెన్ ను అమెరికా బలగాలు మట్టుబెట్టిన తర్వాత అల్ జవహరి ఆ సంస్థ బాధ్యతలను స్వీకరించాడు. ఈ సందర్భంగా అల్ జవహరితో కూడా మస్రీ అత్యంత సన్నిహితంగా మెలిగాడు. 

  • Loading...

More Telugu News