: సూపర్ ఫాస్ట్ రైళ్లతో పోటీపడనున్న 6 ఎక్స్ ప్రెస్ రైళ్లు... నాలుగు రైళ్లు తెలుగు రాష్ట్రాలవే!
ఆరు ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగాన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రేళ్ల వేగానికి పెంచారు. అంతేకాదు, వీటి నంబర్లను కూడా మార్చనున్నారు. ఈ మేరకు ప్రతిపాదలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. వివరాలు...
- సంబల్ పూర్- హెచ్.ఎస్.నాందేడ్ నాగావళి ఎక్స్ ప్రెస్ నెంబర్ 12755గా మార్చారు. మే 26 నుంచి మార్పు అమల్లోకి వస్తుంది.
- హెచ్.ఎన్.నాందేడ్-సంబల్ పూర్ నాగావళి ఎక్స్ ప్రెస్ నంబర్ 12756గా మార్చారు. మే 27 నుంచి మార్పు అమల్లోకి వస్తుంది.
- విశాఖపట్నం-హెచ్.ఎస్.నాందేడ్ ఎక్స్‌ప్రెస్ నెంబర్‌ను 12753గా మార్చారు. ఈ మార్పు మే 27 నుంచి అమల్లోకి వస్తుంది.
- హెచ్.ఎస్.నాందేడ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ నెంబర్‌ను 12754గా మార్చారు. ఈ మార్పు మే 28 నుంచి అమల్లోకి వస్తుంది.
- మచిలీపట్నం-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ నెంబర్‌ను 12749గా మార్చారు. మే 25 నుంచి మార్పు అమల్లోకి వస్తుంది.
- సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నెంబర్‌ను 12750గా మార్చారు. ఈ మార్పు మే 26 నుంచి అమలులోకి వస్తుంది.