: శశికళకు ఆ ధైర్యం ఉందా? సవాలు విసిరిన మాజీమంత్రి మునుస్వామి
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మాజీ మంత్రి కేపీ మునుస్వామి సవాలు విసిరారు. జయలలిత పోటీ చేసి విజయం సాధించిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బరిలోకి దిగి విజయం సాధించాలని సవాల్ చేశారు. జయ అనారోగ్యానికి, ఆమె మృతికి మన్నార్‌గుడి మాఫియానే కారణమని ఆరోపించారు. ‘అమ్మ’లాగా వస్త్రధారణ చేసుకున్నంత మాత్రాన ప్రజలు ఆమెను సీఎంగా అంగీకరించరని అన్నారు. అవినీతి కేసులో తప్పకుండా ఆమెకు వ్యతిరేకంగానే తీర్పు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న పన్నీర్ సెల్వాన్ని ‘మన్నార్‌గుడి మాఫియా’ అడ్డుకుంటోందని మునుస్వామి ఆరోపించారు.