: నేను ఎప్పుడూ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడలేదు: బాలీవుడ్ నటి సాగరిక


టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నారా? అనే ప్రశ్నకు బాలీవుడ్ నటి సాగరిక స్పందిస్తూ, తన వ్యక్తిగత విషయాల గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని సమాధానమిచ్చింది. నిజం చెప్పాలంటే, మీడియాతో తాను ఇంత వరకూ సరిగ్గా మాట్లాడలేదని చెప్పింది. అయితే, ఏ విషయం అయినా తాను మాట్లాడాల్సినప్పుడే మాట్లాడతానని, జహీర్ ఖాన్ అంటే తనకు ఎంతో గౌరవం అని పేర్కొంది. కాగా, ఇటీవల జరిగిన యువరాజ్ సింగ్ వివాహానికి జహీర్ తో కలిసి సాగరిక హాజరైంది. ఆమె తాజా చిత్రం ‘ఇరాదా’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, అర్షాద్ వర్సీ, దివ్యా దత్తా, శరద్ ఖేల్కర్ తదితరులు నటించారు.

  • Loading...

More Telugu News