: కూతురి ఫొటోను పోస్ట్ చేసిన బాలీవుడ్ నటుడు!


బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తాజాగా తన కూతురి ఫొటోను విడుదల చేశాడు. ఫిబ్రవరి 25న తన పుట్టినరోజు సందర్భంగా తన కూతురు మిషా కపూర్ ఫొటోను పోస్ట్ చేస్తానని ఇటీవల షాహిద్ చెప్పాడు. అయితే, తాను చెప్పిన తేదీ కన్నా ముందుగానే, ఈ ఫొటోను పోస్ట్ చేయడం విశేషం. తమ కుమార్తె మిషాను షాహిద్ భార్య మీరా రాజ్ పుత్ తనపై పడుకోబెట్టుకుని ఉన్న ఫొటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి ఆసక్తికర కామెంట్స్ వస్తున్నాయి. షాహిద్ తమ చిన్నారి ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేయడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News