: నాకు 131 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంది!: మీడియా ముందు శశికళ


చెన్నైలోని అన్నాడీఎంకే ప్ర‌ధాన‌ కార్యాల‌యంలో శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ స‌మ‌క్షంలో నిర్వ‌హించిన ఎమ్మెల్యేల స‌మావేశం ముగిసింది. ఈ సంద‌ర్భంగా శ‌శిక‌ళ మీడియాతో మాట్లాడుతూ... అన్నాడీఎంకేను ఏ శ‌క్తీ విడ‌దీయ‌లేదని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం త‌మ ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకేనే సంక్షోభంలో ఉంద‌ని చెప్పారు. తమ పార్టీలో సంక్షోభం లేదని వ్యాఖ్యానించారు. పార్టీని చీల్చాల‌ని కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. త‌న‌కు 131 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని ఆమె చెప్పారు. జ‌య‌ల‌లిత బాట‌లోనే తాము అంద‌రం న‌డుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆమె ఆశ‌యాల‌ను నెర‌వేరుస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News