: నాకు పూర్తి మద్దతు ఉంది: పన్నీర్ సెల్వం
అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంటానని అన్నాడీఎంకే నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. ఈ రోజు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... తనకు పార్టీలో పూర్తి మద్దతు ఉందని ప్రకటించారు. శాసనసభ సమావేశాలు జరిగితే తనకు మద్దతిచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తనను కొన్ని రోజుల క్రితం పార్టీలో కొందరు టార్గెట్ చేశారని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రజల మద్దతుతో తాను సీఎంగా వారికి సేవ చేసుకుంటానని స్పష్టం చేశారు.