: పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన దీప...కాసేపట్లో భేటీ


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు జయలలిత మేనకోడలు దీప మద్దతు ప్రకటించింది. కాసేపట్లో వీరిద్దరూ సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా, శశికళపై దీప చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొత్తగా పార్టీని కూడా ఏర్పాటు చేస్తానని ఆమె గతంలో ప్రకటించారు. పదవికి రాజీనామా చేసిన అనంతరం దీపలో ప్రవహించేది కూడా అమ్మ (జయలలిత) రక్తమేనని, ఆమె మద్దతు తీసుకుంటానని పన్నీర్ సెల్వం ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News