: రద్దయిన నోట్లను ఉంచుకుంటే ఇక జరిమానా లేదా జైలు... బిల్లుకు లోక్ సభ ఆమోదం


నవంబర్ 8 నుంచి చలామణి నుంచి రద్దయిన పాత నోట్లను దగ్గరుంచుకుంటే జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించేలా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ ఆమోదం పలికింది. పాత రూ. 500, రూ. 1000 నోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే రూ. 10 వేల వరకూ జరిమానా విధించాలని, ఉన్న నోట్ల సంఖ్యను బట్టి జైలు శిక్ష విధించాలా? లేదా? అన్న విషయాన్ని కోర్టులు తేలుస్తాయని బిల్లులో ప్రతిపాదించారు. డీమానిటైజేషన్ బిల్లును ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News