: కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన బెంగాలీ నటి మృతదేహం... హత్యాచారమా? ఆత్మహత్యా?


బెంగాలీ వినోద పరిశ్రమలో రాణిస్తున్న ఓ నటి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడటం కోల్ కతాలో కలకలం రేపింది. బితాస్తా సాహా అనే నటి తన ఫ్లాట్ లోనే ఉరేసుకున్న స్థితిలో సీలింగ్ కు వేలాడుతూ కనిపించింది. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, దక్షిణ కోల్ కతాలోని కస్బా ప్రాంతంలో సాహా, ఓ ఫ్లాట్ లో నివసిస్తోంది. రెండు రోజులుగా ఆమె ఫోన్ కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాకపోవడం, ఆపై ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆమె తల్లి ఫ్లాట్ కు వచ్చింది. లోపలి నుంచి గడియ పెట్టుకున్నట్టు ఉండటంతో, పలుమార్లు తలుపులు బాది స్పందన లేకపోవడంతో, స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఆమె శరీరం సీలింగ్ కు వేలాడుతూ కనిపించింది. ఆమె మణికట్టు విరిచేయబడి వుంది. శరీరంపై పలు చోట్ల గాయాలు కనిపిస్తున్నాయి. దీంతో సాహా ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, అత్యాచారం, హత్య అనుమానాలు కూడా కలుగుతున్నాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపామని, రెండు, లేదా మూడు రోజుల ముందే ఆమె మరణించి వుండవచ్చని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె ఫేస్ బుక్ పోస్టులు, గోడలపై రాతలను పరిశీలిస్తే, ఆమె కొంత డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందని, విచారణ జరుపుతున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News