: అమ్మ ఆత్మగా కనిపిస్తే.. మరి మోదీ భూత వైద్యుడా?: తమిళ రాజకీయాలపై వర్మ ఘాటు ట్వీటు
తమిళనాడులో జరుగుతున్న ఉత్కంఠకర రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ ఆ విషయంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ట్వీటు వదిలాడు. తమ పార్టీ నేతలపై అలిగిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిన్న తనకు అమ్మ జయలలిత ఆత్మ కనిపించిందని, పలు సూచనలు చేసిందని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై తన ట్విట్టర్ ఖాతాలో రాంగోపాల్ వర్మ ‘తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పొలిటికల్ హార్రర్ మూవీలా ఉన్నాయి’ అని పేర్కొన్నాడు. అమ్మ ఆత్మ కనిపించిందని, సీఎంగా ఉండాలని సూచించిందని పన్నీర్ సెల్వం అంటున్నారని, అయితే, మరి ప్రధాని మోదీ ఇప్పుడు భూత వైద్యుడు కానున్నారా? అని ఆయన ప్రశ్నించాడు.
Happenings in TN seem like a political Horror film with OPS claiming Jayalalitha's ghost told him to be CM..Will Modi be the exorcist now?
— Ram Gopal Varma (@RGVzoomin) 8 February 2017