: తమిళనాడు గవర్నర్‌పై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు.. శశికళ సీఎం కావాల్సిందేనన్న బీజేపీ నేత
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళకు అపారమైన భక్తిశ్రద్ధలు ఉన్నాయని, ఆమె మంచి హిందూ మహిళ అని పేర్కొన్నారు. గురువారం ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఆమె జాతకం ప్రకారం అదే మంచి ముహూర్తమని స్వామి తెలిపారు. సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి శశికళ అని గవర్నర్ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగతంగా ఆమె నచ్చినా, నచ్చకున్నా ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో గవర్నర్‌ను కేంద్రం వివరణ అడగాలని డిమాండ్ చేశారు.