: టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల ఘర్షణ.. పరస్పర దాడులు!
తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగిన సంఘటన విజయవాడలోని కేదారేశ్వర పేటలో జరిగింది. జెండా దిమ్మ ఏర్పాటు చేసే విషయమై రెండు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం తలెత్తింది. టీడీపీ కార్యకర్తలు తమ పార్టీ జెండా ఏర్పాటు చేస్తున్న సమయంలోనే వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి వెళ్లారు. తమ పార్టీ జెండా దిమ్మెను అక్కడ ఏర్పాటు చేసేందుకు యత్నించిన క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో, రెచ్చిపోయిన రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పడంతో శాంతించారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.