: బెడ్ పై మూత్రం పోశాడని.. చిన్నారిని కొట్టి చంపిన వ్యక్తి
ఏ పాపం తెలియని చిన్నారులపై కుటుంబ సభ్యులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో వారి కోపానికి పసివారు బలైపోతున్నారు. తెలియక చేసిన తప్పులకు ఊహతెలియని చిన్నారులను పెద్దలు ఇష్టం వచ్చినట్లు కొడుతుండడంతో ఆ పసివారు మరణిస్తున్న సంఘటనలను ఎన్నింటినో మనం చూస్తున్నాం. తాజాగా ఫ్రాన్స్‌లో ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు బెడ్‌పై మూత్రం పోశాడని ఆగ్రహం తెచ్చుకున్న ఆ చిన్నారి పిన తండ్రి గొడ్డుని బాదినట్లు బాదాడు.
ప్రతి రోజు రాత్రి సమయంలో ఆ బాలుడు బెడ్‌పై మూత్రం పోస్తున్నాడని ఆగ్రహం తెచ్చుకుంటున్న ఆ వ్యక్తి.. ఆ బాలుడిని పట్టుకొని చావబాదాడు. దీంతో ఆ బాలుడి ముఖ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.