: చిన్నమ్మ శ‌శిక‌ళను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరు: తేల్చిచెప్పిన అన్నాడీఎంకే నేతలు


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఎవరో కిందకు పడేసిన కారణంగానే ఆమె మృతి చెందారని, విష‌ ప్ర‌యోగం జ‌రిగింద‌ని అన్నాడీఎంకే సీనియర్ నేత పీహెచ్ పాండియన్ తో పాటు మనోజ్ పాండియన్ సంచలన ఆరోపణలు చేసిన నేప‌థ్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేత పీఎస్ రామచంద్రన్ స్పందించారు. జయలలితపై విషప్రయోగం జరిగిందన్న ఆరోపణలను ఖండించారు. జ‌య‌ల‌లిత‌పై విష ప్రయోగం జరిగిందా? లేదా? అనే విష‌యం వైద్యులు మాత్రమే చెప్పగలరని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ శ్రేణులను పాండియన్ బదర్స్ గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

ఈ విష‌యానికి సంబంధించి ఏదైనా చెప్పాల‌నుకుంటే పార్టీ అంతర్గత వేదికలపై చెప్పాలని వ్యాఖ్యానించారు. పాండియన్ కుటుంబానికి చెందిన ఐదుగురు పదవులు అనుభవించార‌ని, ఇప్పుడు త‌మ‌ పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నార‌ని ఆయన ఆరోపించారు. పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు సెంగొట్టవన్ మాట్లాడుతూ... చిన్నమ్మ శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్‌ను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News