: ఎన్‌కౌంటర్ నేపథ్యంలో భారీగా పేలుడు పదార్థాలను అపహరించిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకి మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దంతెవాడ జిల్లాలో ఎన్‌ఎండీసీకి తరలిస్తున్న పేలుడు పదార్థాలను మావోయిస్టులు చోరీ చేయడం కలకలం రేపుతోంది. వాటిలో డిటోనేటర్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలు భారీగా ఉన్నాయి. పేలుడు పదార్థాలను అపహరించే క్రమంలో పలువురు ఉద్యోగులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పేలుడు పదార్థాలు చోరీ చేసిన అనంతరం వారిని విడిచిపెట్టారు.