: జయలలితను ఇంట్లో తోసేశారు... తీవ్రగాయాల పాలైన ఆమెను ఆసుపత్రికి తెచ్చి హత్య చేశారు: పాండియన్ ఆరోపణల కలకలం


పోయిస్ గార్డెన్ లోని తన నివాసంలో జయలలితను ఎవరో కిందకు పడదోశారని, తీవ్రగాయాల పాలైన ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు నాటకమాడి, ఆమెను హత్య చేశారని అన్నాడీఎంకే సీనియర్ నేత పీహెచ్ పాండియన్ సంచలన ఆరోపణలు చేశారు. జయలలిత మృతి వెనుక ఎలాంటి వివాదాలు లేవని లండన్ వైద్యుడు రిచర్డ్ బేలె వెల్లడించిన మరుసటి రోజు పాండియన్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన, పోయిస్ గార్డెన్ లో జయలలితతో వాదన పెట్టుకున్న ఒకరు, ఆమెను గట్టిగా నెట్టి కిందకు పడదోశారని ఆయన తెలిపారు.

సెప్టెంబర్ 22న ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. జయలలిత మరణం తరువాత శశికళ కనీసం విచారాన్ని వ్యక్తం చేయలేదని పాండియన్ నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో శశికళకు సీఎం అయ్యే అవకాశాలు వస్తాయన్న అనుమానం జయలలితకు ఉండేదని, అలా జరగడం తనకు ఇష్టం లేదని జయలలిత ఓ సారి తనతో చెప్పారని పాండియన్ కుమారుడు, మాజీ ఎంపీ మనోజ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News