: వేగంగా పావులు కదుపుతున్న స్టాలిన్... తమిళనాట రాష్ట్రపతి పాలనకు డిమాండ్
తమిళనాడులో గంటగంటకూ మారుతున్న రాజకీయ పరిస్థితులను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా డీఎంకే నేత స్టాలిన్ పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పాలన అనిశ్చితిలో పడిందని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆయన లేఖ రాస్తూ, జయలలిత మృతి అనంతరం ఏర్పడ్డ పరిస్థితులను ఉదహరించారు. శశికళ సీఎం కావాలని భావిస్తుండటాన్ని తప్పుపట్టిన ఆయన, తమిళనాడు ప్రజలు ఆమెను అంగీకరించే పరిస్థితి లేదని, ఆమె సీఎం అయితే, ఉద్యమాలు జరుగుతాయని, రాష్ట్రం కల్లోలమవుతుందని అన్నారు. వెంటనే కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దాలని స్టాలిన్ కోరారు.