: ముఖ్యమంత్రి వద్దకు చేరిన హిందూపురం పంచాయితీ.. చంద్రబాబుతో బాలయ్య భేటీ
ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురం టీడీపీలో నెలకొన్న అసంతృప్తి తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. బాలకృష్ణ పీఏ శేఖర్ తీరును వ్యతిరేకిస్తూ హిందూపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించిన తీరును ఆయన చంద్రబాబుకి వివరించారు. బాలకృష్ణ పీఏ శేఖర్‌ను తొలగించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.