: చేతగానితనంతో నరేంద్ర మోదీ నిర్ణయాలు... ఇండియా ఎటుపోతుందో?: యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్య
గత సంవత్సరం నవంబర్ 8న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఆయన చేతగాని తనానికి నిదర్శనమని ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త స్టీవ్ హెచ్ హాంకీ అభిప్రాయపడ్డారు. ఆది నుంచి నోట్ల రద్దు గందరగోళం మధ్య సాగిందని ఆయన ఆరోపించారు. ఇండియా ఎటు పయనిస్తోందో ఎవరికీ తెలియదని, ప్రధాని మోదీకి అసలు తెలియడం లేదని అన్నారు. ఇండియాలో నోట్ల రద్దును సమర్థవంతంగా అమలు చేసే స్థితిలో మౌలిక సదుపాయాలు లేవని, ఈ విషయాన్ని పట్టించుకోకుండానే ఆయన రంగంలోకి దిగిపోయారని స్టీవ్ వ్యాఖ్యానించారు. డీమానిటైజేషన్ ప్రభావం భారత జీడీపీపై ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.