: అందుబాటులోకి ‘ఉబర్ హైర్’ సర్వీసులు.. ఇక రోజు మొత్తానికి అద్దెకు తీసుకునే సదుపాయం


‘ఉబర్ హైర్’ పేరుతో సరికొత్త సర్వీసులను ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ సంస్థ ఉబర్ ప్రారంభించింది. ఇప్పటి వరకు కరెంట్ బుకింగ్‌లకే పరిమితమైన ఉబర్ ట్యాక్సీని ఇక నుంచి రోజంతా బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. ముఖ్యంగా పర్యాటకులు, సీనియర్ సిటిజన్లు, వ్యాపారం నిమిత్తం క్యాంపులకు తిరిగే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం నగదు చెల్లింపులకు మాత్రమే ఉబర్ హైర్ సర్వీసులు పరిమితమైనట్టు సంస్థ పేర్కొంది. తాజా సేవలు ప్రస్తుతం కొచ్చి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె, ముంబై, అహ్మదాబాద్, నాగ్‌పూర్, విశాఖపట్టణంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశంలోని మరిన్ని నగరాల్లో ఉబర్ హైర్ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నట్టు ఉబర్ పేర్కొంది. కాగా ఇటువంటి సేవలను మరో ట్యాక్సీ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్ గతేడాదే ‘రెంటల్స్’ పేరుతో ప్రవేశపెట్టింది.

  • Loading...

More Telugu News