: హైదరాబాదు పోలీసులకు నిద్రను దూరం చేసిన దొంగ ‘పోలీసు’ దొరికాడు!
గత కొన్ని రోజులుగా హైదరాబాదు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సూడో పోలీస్ ఎట్టకేలకు చిక్కాడు. పోలీసు తనిఖీల పేరుతో ద్విచక్ర వాహనదారులను ఆపి దోపిడీలకు పాల్పడుతున్న దుండగుడిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నాలుగు రోజుల వ్యవధిలోనే పోలీసుల పేరుతో మూడు చోరీలకు పాల్పడి పోలీసులకు సవాలు విసిరిన దుండగుడి ఊహాచిత్రాన్ని మూడు రోజుల క్రితం పోలీసులు విడుదల చేశారు. పత్రికల్లో అతడి ఫొటో ప్రచురితం కావడంతో అప్రమత్తమైన దుండగుడు దోపిడీలకు పుల్‌స్టాప్ పెట్టాడు. అయితే ఎల్బీనగర్లో తిరుగుతున్న అతడిని గుర్తించిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు కాపుకాసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు బయట పెట్టలేదు.