: అరె, సెహ్వాగ్! కొద్దిసేపు ఆగి ఉంటే ఈ ఫొటోను ఉపయోగించుకునే వాడివిగా!: సచిన్
‘అరె, సెహ్వాగ్! కొద్దిసేపు ఆగి ఉంటే ఈ ఫొటో ఉపయోగించుకునే వాడివిగా’ అంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇంతకీ, ఈ వ్యాఖ్యలు సచిన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. ఈ నెల 4వ తేదీన వీరేంద్ర సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘ఢిల్లీలో దేవుడి దర్శనం’ అంటూ సచిన్ ను కలిసిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ట్వీట్ కు స్పందించిన సచిన్, అంతకంటే మెరుగైన ఫొటోను పోస్ట్ చేసి, కొంచెం సేపు ఆగి ఉంటే ఈ ఫొటోను ఉపయోగించుకునే వాడివని, తనను కలవడం ఎప్పుడూ సంతోషమేనని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అందుకు, స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్, నవ్వుతూ, ఎప్పటి లాగే మళ్లీ తొందరపడ్డానని, మిమ్మల్ని ఎవ్వరు, ఎప్పుడు కలిసినా సంతోషం కలుగుతుంది అని పేర్కొన్నాడు.