: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవాచార్యులు కన్నుమూత
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిలుకూరు బాలాజీ ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకుడు శ్రీనివాస రాఘవాచార్యులు (105) ఈరోజు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు రాఘవాచార్యులు కుటుంబసభ్యులు తెలిపారు. రేపు ఉదయం పదకొండు గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాఘవాచార్యుల కుమారుడు గోపాలకృష్ణ స్వామి ప్రస్తుతం ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు.