: 'శ్రీమంతుడు' కథా చౌర్యం కేసులో.. మహేశ్ బాబుకి నాంపల్లి కోర్టు సమన్లు
సినీనటుడు మహేశ్ బాబుకి ఈ రోజు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మహేశ్‌బాబు హీరోగా నటించిన సందేశాత్మక చిత్రం శ్రీమంతుడు సినిమా కథ తనదేనని రచయిత శరత్ చంద్ర కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. అనంతరం మహేశ్‌బాబుతో పాటు శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలకు కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 3న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తన నవల ‘చచ్చేంత ప్రేమ’ కథను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని శరత్ చంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు.