: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల


ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఫిబ్రవరి 20 కాగా, ఫిబ్రవరి 21న నామినేషన్ల పరిశీలన వుంటుంది. ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 23 కాగా, మార్చి 9న పోలింగ్, 15వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి; ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయుల  నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News