: అమెరికా విమానాశ్రయాల్లో ఎక్కడ చూసినా భావోద్వేగ దృశ్యాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులు, ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఇటీవలే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడంతో ఆయా దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ అప్పీళ్ల న్యాయస్థానం తిరస్కరించడంతో ఆయా ముస్లిం మెజారిటీ దేశాల ప్రజలు తిరిగి అమెరికాకు వస్తున్నారు. ఇక తమ రాక అసాధ్యమనుకున్న నేపథ్యంలో వారు తిరిగి అమెరికాకు చేరుకుంటుండడంతో వారు ఆనందబాష్పాలతో విమానం దిగుతున్నారు. తాజాగా పలు ఎయిర్‌పోర్టుల్లో ముస్లిం దేశాల నుంచి వచ్చిన వారు అమెరికాలోని తమ బంధువులు, ఆత్మీయులు, మిత్రులను కలుసుకుని కన్నీటితో ఆలింగనాలు చేసుకున్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు ఈ ఏడు దేశాల ప్రజలను కూడా అమెరికాకు వెళ్లే విమానాల్లో ఎక్కించుకుంటున్నాయి. విమానాశ్రయాల్లో ఆనందబాష్పాలు, ఆనందంతో కౌగిలింతల దృశ్యాలు కనిపిస్తున్నాయి.