: జయలలితను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్ వుంది!: రిచర్డ్ బెలే


దివంగత జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే, అమ్మ మరణంపై ఎందరిలోనో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, జయకు వైద్య చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్ బీలే ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. జయకు అందించిన చికిత్స వివరాలను వెల్లడించారు. ఆసుప్రతికి తీసుకొచ్చినప్పుడు జయకు సీరియస్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. విషమ పరిస్థితుల్లో ఆమెను హాస్పిటల్ కు తీసుకొచ్చారని తెలిపారు. ఇన్ఫెక్షన్ తో శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయని తెలిపారు. చికిత్సకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించడం అనేది హాస్పిటల్ నియమ నిబంధనలకు సంబంధించిన విషయమని చెప్పారు. 

  • Loading...

More Telugu News