: 'ఓం నమో వేంకటేశాయ' సినిమా పేరుపై వివాదం.. రాఘవేంద్రరావు దిష్టిబొమ్మ దగ్ధం


ప్రముఖ సినీ నటుడు నాగార్జున, దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' సినిమా పేరుపై వివాదం నెలకొంది. సినిమా పేరును వెంటనే మార్చాలని కరీంనగర్ జిల్లా కేంద్రంలో గిరిజనులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ, గిరిజన జాతికి చెందిన హాథీరామ్ బాబా కథను తెరకెక్కించిన రాఘవేంద్రరావు... సినిమా పేరును ఓం నమో వేంకటేశాయ అని పెట్టడం అత్యంత దారుణమని అన్నారు. దర్శకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. మరోవైపు, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతోంది.

  • Loading...

More Telugu News