: అసహజ సంబంధం కోసం అక్కాచెల్లెళ్ల ఒత్తిడి... తట్టుకోలేక యువతి ఆత్మహత్య!


కాలేజీ హాస్టల్ లో తమతో అసహజ సంబంధం (లెస్బియన్ అఫైర్) పెట్టుకోవాలని ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని ఇద్దరు అక్కా చెల్లెళ్లు వేధిస్తుండటంతో, తట్టుకోలేని బాధితురాలు తనువు చాలించింది. ఈ ఘటన చండీగఢ్ సమీపంలోని కర్నాల్ రెసిడెన్షియల్ స్కూల్ లో జరుగగా, పోలీసులు సెక్షన్ 306 కింద కేసు పెట్టి విచారణ ప్రారంభించారు. అదే పాఠశాలలో చదువుతున్న అక్కా చెల్లెళ్లు బాధితురాలితో అనైతిక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తుండేవారని, ఈ విషయాన్ని ఆమె స్కూలు అధికారులకూ ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆపై ఆమెను వారి గది నుంచి మరో గదికి మార్చారని, ఆ తరువాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. ఇతర విద్యార్థినుల స్టేట్ మెంట్లను నమోదు చేశామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News