: కుమార్తె తలనీలాలు సమర్పించి, వెంకన్నకు మొక్కులు చెల్లించిన అల్లు అర్జున్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాడు. తన కుమార్తె తలనీలాలను స్వామి వారికి సమర్పించాడు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాడు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నాడు. తన భార్య స్నేహ, కుమారుడు, తన తల్లిదండ్రులతో కలసి బన్నీ తిరుమలకు వచ్చాడు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.