: 'జబర్దస్త్' కార్యక్రమంలో బూతులపై నాగబాబు స్పందన


ఓ తెలుగు టీవీ చానల్ లో ప్రసారమవుతున్న 'జబర్దస్త్' కార్యక్రమం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. అయితే, ఈ కార్యక్రమంలో బూతు డోసు ఎక్కువవుతోందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు స్పందించారు. ఈ షోలో కామెడీ ఎక్కువైపోయి, బూతుగా మారడం తనను కూడా బాధపెడుతోందని ఆయన అన్నారు. దీనిపట్ల తాను కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. అయితే, షో జరుగుతుండగా ఆ విషయాన్ని చెప్పడం కుదరదని... దీంతో, ఆ తర్వాత వచ్చే స్కిట్ లలో బూతు తగ్గించాలని సూచిస్తుంటానని తెలిపారు. అయితే అన్ని టీములు తన సూచనను కొంతకాలం పాటు పాటిస్తాయని... ఆ తర్వాత మళ్లీ మొదలు పెట్టేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇంటిల్లిపాది చూస్తుంటారని... అందుకే అసభ్యత ఉండరాదని తాను చెబుతూనే ఉంటానని తెలిపారు.  

  • Loading...

More Telugu News