: తమిళనాడు రాజకీయం: రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్న గవర్నర్ విద్యాసాగర్ రావు
తమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు నేడు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకునే ఆయన రాజ్ నాథ్ సింగ్ తో సీఎం మార్పుపై చర్చించనున్నట్టు సమాచారం. నిన్న జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో శశికళను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడం, ఆపై పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్, విద్యాసాగర్ ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.