: మా కుటుంబం మొత్తం పవన్ కు అండగా ఉంటుంది!: నాగబాబు
పవన్ కల్యాణ్ పార్టీకి అన్నయ్య చిరంజీవి సపోర్టు ఉండాలని తాను కోరుకుంటున్నానని ‘మెగా’ బ్రదర్ నాగబాబు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తానైతే తమ్ముడికి సపోర్టుగా ఉంటానని, ఒకవేళ పవన్ వద్దన్నా కూడా, ఒక పౌరుడిగా ఆ పార్టీలో చేరే ప్రాథమికహక్కు తనకు ఉందని అన్నారు. ఒక సాధారణ కార్యకర్తలా ‘జనసేన’కు తన సేవలు అందిస్తానని చెప్పిన నాగబాబు, తమ కుటుంబం మొత్తం పవన్ కు అండగా ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, పవన్ తో ఎవరినీ పోల్చలేమని, ప్రత్యేకమైన వ్యక్తిత్వమని, అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే, రాష్ట్రం వంద శాతం బాగుపడుతుందనే నమ్మకం తనకు ప్రగాఢంగా ఉందని చెప్పారు.