: గణతంత్ర దినోత్సవం నాడు జగిత్యాలలో జరిగిన సంఘటనపై ప్రభుత్వం స్పందించదేం?: ఉత్తమ్ కుమార్


గణతంత్ర దినోత్సవం నాడు జగిత్యాలలో జరిగిన సంఘటనపై ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగిత్యాలలో గణతంత్ర దినోత్సవం నిర్వహించిన రోజున విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పార్టీ జెండాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం విడ్డూరమని, జగిత్యాల జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించడం తనను మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించ లేదని, ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.



  • Loading...

More Telugu News